రాజశ్యామల యాగంలో కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజశ్యామల యాగంలో పాల్గొన్నారు. ఎర్రవల్లిలోని తన ఫాం హౌస్ లో ఆయన ఈ యాగంలో పాల్గొన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజశ్యామల యాగంలో పాల్గొన్నారు. ఎర్రవల్లిలోని తన ఫాం హౌస్ లో ఆయన ఈ యాగంలో పాల్గొన్నారు. రాజశ్యామల యాగం మూడు రోజుల పాటు జరగనుంది. తెలుగు రాష్ట్రాల సర్వతోముఖాభివృద్ధిని కాంక్షిస్తూ ఈ యాగాన్ని కేసీఆర్ తలపెట్టినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ యాగంలో కేసీఆర్ దంపతులు పాల్గొన్నారు. రాజశ్యామల యాగాన్ని స్వామి స్వరూపనందేంద్ర స్వామి నేతృత్వంలో వేదపండితులు నిర్వహిస్తున్నారు.
నాలుగు రాష్ట్రాల నుంచి...
ఈరోజు గోపూజ అనంతరం కేసీఆర్ దంపతులు యాగశాల ప్రవేశం చేశారు. గణపతి పూజ, పుణ్యహవచనం, పంచగవ్య ప్రాసనతో యాగానికి అంకుకరార్పణ జరిగింది. గురు ఆజ్ఞను తీసుకుని యాగాన్ని ప్రారంభించారు. ఈ యాగానికి తమిళనాడు,కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి రెండు వందల మంది వరకూ వేదపండితులు హాజరయ్యారు. ఈ యాగంలో కేసీఆర్ దంపతులతో పాటు పలువురు పార్టీ నేతలు కూడా పాల్గొన్నారు. మూడు రోజుల పాటు యాగం జరగనుంది.