రేపు యాదాద్రికి కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు యాదాద్రికి వెళ్లనున్నారు. స్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు

Update: 2022-03-10 14:14 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు యాదాద్రికి వెళ్లనున్నారు. స్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. యాదాద్రి లో జరగనున్న పనులను ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షించనున్నారు. యాదాద్రి ఉద్ఘాటన పనులు దగ్గర పడుతుండటంతో కేసీఆర్ పనుల పురోగతిని స్వయంగా సమీక్షించనున్నారు.

పనుల పురోగతిపై....
మార్చి 21వ తేదీ నుంచి 28వ తేదీ వరకూ యాదాద్రి ఉద్ఘాటన కార్యక్రమాలు జరగనున్నాయి. పనులు వేగవంతంగా పూర్తి కావచ్చాయి. మహా సుదర్శన యాగాన్ని కూడా నిర్వహించనున్నారు. వీటన్నింటిపై ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రికి వెళ్లి సమీక్షించనున్నారు. ఇప్పటికే పలుమార్లు కేసీఆర్ యాదాద్రికి వెళ్లి పనుల పురోగతిని స్వయంగా తెలుసుకున్న సంగతి తెలిసిందే.


Tags:    

Similar News