తొలి విడత 40 చోట్ల ప్రచారం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పదహారు రోజుల పాటు ప్రచారంలో పాల్గొంటారు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పదహారు రోజుల పాటు ప్రచారంలో పాల్గొంటారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో ఆయన జిల్లాల టూర్ అధికారికంగా ఖరారయింది. ఈ నెల 15వ తేదీ నుంచి నవంబరు 8వ తేదీ వరకూ వరసగా ప్రచార సభలను కేసీఆర్ నిర్వహిస్తారు. ఈ నెల 15వ తేదీన హుస్నాబాద్ తో ప్రారంభమయ్యే పర్యటన నవంబరు 8వ తేదీన బెల్లంపల్లిలో ముగుస్తుంది. పదహారు రోజుల పాటు కేసీఆర్ బహిరంగ సభల్లో పాల్గొంటారు.
16 రోజుల పాటు...
ఒక్కోరోజు రెండు మూడు నియోజకవర్గాల్లో పర్యటించాలని నిర్ణయించారు. తొలి విడతగా నలభై నియోజకవర్గాల్లో కేసీఆర్ ప్రచారాన్ని నిర్వహిస్తారు. నవంబరు 9వ తేదీన ఆయన కామారెడ్డి, గజ్వేల్‌లో నామినేషన్లు వేస్తారు. సాయంత్రం కామారెడ్డిలో జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. కేసీఆర్ ప్రచార షెడ్యూల్ విడుదల కావడంతో పార్టీ నేతలు ఆయన పర్యటన కోసం అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. మొత్తం పదహారు రోజుల పాటు నాన్ స్టాప్ గా ఆయన ప్రచారాన్ని నిర్వహిస్తారు.