Breaking : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అసంతృప్తిపై రేవంత్ ఫస్ట్ రియాక్షన్

ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అసంతృప్తిపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలిసారి స్పందించారు.

Update: 2024-06-27 06:30 GMT

ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అసంతృప్తిపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలిసారి స్పందించారు. పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి జగిత్యాల ఎమ్మెల్యే సంజీవ్ కుమార్ కాంగ్రెస్ లో చేరారన్నారు. అయితే పీసీసీ నుంచి కొంత సమన్వయం లోపం కనిపించిందన్నారు. అందుకే జీవన్ రెడ్డి అసంతృప్తికి లోనయ్యారని తెలిపారు. జీవన్ రెడ్డి సీనియర్ నేత అని, ఆయనను కాదని ఎవరూ ఎలాంటి నిర్ణయం తీసుకునేందుకు అవకాశం లేదని రేవంత్ రెడ్డి తెలిపారు.

ఆయన సేవలను...
కేసీ వేణుగోపాల్, దీపాదాస్ మున్షీ వంటి నేతలు జీవన్ రెడ్డితో మాట్లాడారన్నారు. సీనియర్ నేతగా జీవన్ రెడ్డి సేవలను తాము వినియోగించుకుంటామని చెప్పారు. పీీసీసీ వల్లనే కొంత గందరగోళం నెలకొందని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి నష్టం జరగాలని కొందరు అనుకున్నారని, కానీ అది జరగకపోవడంతో నిరాశకు లోనయ్యారని రేవంత్ రెడ్డి అన్నారు. జీవన్ రెడ్డి సేవలను సరైన సమయంలో ఉపయోగించుకుంటామని హైకమాండ్ ఆయనకు స్పష్టమైన హామీ ఇచ్చిందని తెలిపారు.


Tags:    

Similar News