Revanth Reddy : నేడు సీఎం రేవంత్ బర్త్‌డే.. మూసీ నది పరివాహక ప్రాంతంలో పాదయాత్ర
ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలను జరుపుకుంటున్నారు
ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలను జరుపుకుంటున్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలి పుట్టిన రోజు వేడుకలను ఆయన పేదల సమస్యలను పరిశీలనతో జరపాలని నిర్ణయించారు. ఉదయం 9 గంటలకు యాదగిరిగుట్టకు హెలికాప్టర్ లో కుటుంబ సభ్యులతో కలసి ప్రయాణమవుతారు. ఉదయం పది గంటలకు లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని పూజలు నిర్వహిస్తారు. ఆలయ అర్చకులు, పార్టీ నేతలు ఆయనకు ఘన స్వాగతం పలుకుతారు.
సంగెం వెళ్లి...
యాదగిరి గుట్టలో ఆయనకు వేదపండితులు ఆశీర్వచనాలు అందచేస్తారు. అనంతరం దేవాలయ అధికారులతో సమావేశమై సమీక్ష జరుపుతారు. అనంతరం 1.30 గంటలకు ఆయన రోడ్డు మార్గంలో సంగెం వెళతారు. సంగెం నుంచి మూసీ నది పునరుజ్జీవ సంకల్పం తీసుకుంటారు. అంటే సంగెం నుంచి రేవంత్ రెడ్డి పాదయాత్రను ప్రారంభిస్తారు. సంగెం నుంచి మూసీనది కుడిఒడ్డున భీమలింగం వరకూ సుమారు 2.5 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేస్తారు.
పాదయాత్ర.....
అక్కడి నుంచి ధర్మారెడ్డిపల్లి కెనాల్ వెంట సంగెం - నాగిరెడ్డిపల్లి వరకూ పాదయాత్ర చేస్తారు. అనంతరం మూసీ నది పునరుజ్జీవంపై ఆయన మాట్లాడనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలను కాంగ్రెస్ నేతలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్త్ున్నారు. మరోవైపు మూసీ నది పాదయాత్రకు సంబంధించిన ఏర్పాట్లను కూడా చేశారు. పుట్టిన రోజు నాడు తాను మూసీ నది పునరుజ్జీవ యాత్ర చేపట్టి అక్కడి పేదల సమస్యలను స్థానికంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలుసుకోనున్నారు. మూసీ నది ప్రక్షాళన అవసరాన్ని కూడా ఆయన రాష్ట్ర ప్రజలకు వివరించనున్నారు.