Telangana : జైపూర్ బయలుదేరి వెళ్లిన సీఎం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జైపూర్ బయలుదేరివెళ్లారు. అక్కడి నుంచి ఆయన ఢిల్లీకి వెళతారు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జైపూర్ బయలుదేరివెళ్లారు. అక్కడి నుంచి ఆయన ఢిల్లీకి వెళతారు. జైపూర్ లో తన బంధువుల ఇంట్లో వివాహ వేడుకలకు హాజరయ్యేందుకు కుటుంబ సభ్యులతో కలసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లారు. ఈరోజు శుభకార్యంలో పాల్గొని సాయంత్రానికి ఢిల్లీకి వస్తారు. ఢిల్లీలో ఏఐసీసీ నేతలను కలవనున్నారు.
రెండు రోజులు ఢిల్లీలో...
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు రోజుల పాటు ఢిల్లీలోనే ఉండనున్నారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతుండటంతో కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాల గురించి చర్చించే అవకాశాలున్నాయి. అలాగే పార్టీ పెద్దలను కలసి రాష్ట్ర రాజకీయాలపై మాట్లాడే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకోవడంతో పెద్దలను కలసి తాము అమలు చేసిన పథకాలను కూడా వివరించనున్నారు.