Revanth Reddy : ప్రధానితో భేటీ అయిన రేవంత్
ప్రధాని నరేంద్ర మోదీతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు.;
ప్రధాని నరేంద్ర మోదీతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఆయనతో పాటు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ భట్టి విక్రమార్క కూడా సమావేశమయ్యారు. కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు రావాల్సిన పెండింగ్ నిధుల విడుదల గురించి ప్రధాని మోదీ దృష్టికి తీసుకురానున్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరనున్నారు.
రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా....
గత దశాబ్దకాలంగా అనేక అంశాలు పెండింగ్‌లో ఉన్నందున వాటిని వెంటనే అమలు చేయాలని ప్రధాని మోదీని కోరనున్నారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలని ఇరువురు నేతలు కోరనున్నారు. అలాగే విభజన సమయంలో ఇచ్చిన పెండింగ్ ప్రాజెక్టులను కూడా మంజూరు చేయాలని రేవంత్ రెడ్డి ప్రధాని మోదీని కోరనున్నారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా సహకరించాలని కోరనున్నారు.