Telangana : నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనిఖీలు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు రాష్ట్రంలో ఉన్న హాస్టళ్లను తనిఖీ చేయనున్నారు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు రాష్ట్రంలో ఉన్న హాస్టళ్లను తనిఖీ చేయనున్నారు. సంక్షేమ హాస్టళ్లలో పరిస్థితులను స్వయంగా అంచనా వేయడానికి ఆయన తనిఖీలు చేయాలని నిర్ణయించుకున్నారు. రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు, చీఫ్ సెక్రటరీ శాంతి కుమారీలతో కలసి గురుకుల, రెసిడెన్షియల్ హాస్టళ్లను తనిఖీ చేయనున్నారు.హాస్టళ్లను సందర్శించి అక్కడే భోజనం కూడా చేయనున్నారు.
తనిఖల ద్వారా...
హాస్టళ్లలో మౌలికసదుపాయాలను కల్పించేందుకు కూడా ఈ తనిఖీలు ఉపయోగపడతాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. తమ తనిఖీల నేపథ్యంలో హాస్టల్స్ అధికారుల్లో బాధ్యత పెరుగుతుందని భావిస్తున్నారు. హాస్టళ్లలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు రేవంత్ రెడ్డి కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశముంది.