Revanth Reddy : నేడు కలెక్టర్లతో రేవంత్ సమావేశం

నేడు జిల్లా కలెక్టర్లతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు;

Update: 2025-01-10 03:44 GMT

నేడు జిల్లా కలెక్టర్లతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. ఈ నెల 26వ తేదీ నుంచి తెలంగాణలో రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. దీంతో పాటు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన లబ్దిదారుల ఎంపిక వంటి వాటిపై రేవంత్ రెడ్డి కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్నారు.

పలు కార్యక్రమాలకు...
ఇందిరమ్మ ఇళ్లకు నిర్మాణానికి సంబంధించి లబ్దిదారుల ఎంపిక ప్రక్రియలో తీసుకోవాల్సిన చర్యలను ఈ సమావేశంలో ప్రస్తావించనున్నారు. అలాగే రైతు భరోసా నిధులను ఎవరిని ఎంపిక చేయాలన్న దానిపై కూడా ఈ సమావేశంలో కలెక్టర్లకు రేవంత్ రెడ్డి క్లారిటీ ఇవ్వనున్నారు. దీంతో పాటు పలు అభివృద్ధి పనులకు సంబంధించిన అంశాలను కూడా ఈ సమావేశాల్లో చర్చించనున్నారు.


Tags:    

Similar News