టీజీఆర్టీసీ అదనపు ఛార్జీలు.. ఎప్పటి నుంచి అంటే?

తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. సంక్రాంతి ప్రత్యేక బస్సుల్లో 50 శాతం వరకు అదనపు ఛార్జీలు వసూలు చేయాలని నిర్ణయించింది;

Update: 2025-01-10 04:30 GMT

తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. సంక్రాంతి ప్రత్యేక బస్సుల్లో 50 శాతం వరకు అదనపు ఛార్జీలు వసూలు చేయాలని నిర్ణయించింది. ఈ నెల 10, 11, 12, 19, 20 తేదీల్లో సర్వీసులకు మాత్రమే ఈ అదనపు ఛార్జీలు వసూలు చేస్తామని అధికారులు తెలిపారు. సంక్రాంతి పండగ కోసం 6,432 స్పెషల్‌ సర్వీసులను టీజీఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోది. 19, 20 తేదీల్లో తిరుగు ప్రయాణానికి సంబంధించిన బస్సులను కూడా ఏర్పాటు చేస్తుంది.

ఈ తేదీల్లో మాత్రమే...
అయితే 10, 11, 12, 19, 20.. ఈ ఐదు రోజుల పాటు అదనపు ఛార్జీలు ఉంటాయని ఆర్టీసీ అధికారులు తెలిపారు. సంక్రాంతి పండగకు వివిధ ప్రాంతాలకు నడిచే పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరి, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు రవాణా సదుపాయం యథావిధిగా ఉంటుందని స్పష్టం చేసింది. సంక్రాంతి ప్రత్యేక బస్సులకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం ఆర్టీసీ కాల్‌సెంటర్‌ నంబర్లు 040-69440000, 040-23450033లలో సంప్రదించవచ్చని పేర్కొంది. ప్రత్యేక బస్సులు ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్‌ క్రాస్‌ రోడ్స్, ఆరాంఘర్, ఎల్బీనగర్‌ క్రాస్‌ రోడ్స్, కేపీహెచ్‌బీ, బోయిన్‌పల్లి, గచ్చిబౌలి తదితర ప్రాంతాల నుంచి ఉంటాయని అధికారులు తెలిపారు.


Tags:    

Similar News