Telangana : నేడు బీజేపీ కీలక సమావేశం
హైదరాబాద్ లో నేడు బీజేపీ కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ఇన్ ఛార్జి సునీల్ బన్సల్ హాజరు కానున్నారు;
హైదరాబాద్ లో నేడు బీజేపీ కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ఇన్ ఛార్జి సునీల్ బన్సల్ హాజరు కానున్నారు. ముఖ్య నేతలతో ఆయన సమావేశం కానున్నారు. తాజా రాజకీయ పరిణామాలు, సంస్థాగత ఎన్నికలపై సునీల్ బన్సల్ చర్చించనున్నారు. ఇప్పటికే పార్టీ మండల అధ్యక్షుల ఎన్నిక పూర్తి కావడంతో జిల్లా అధ్యక్షుల ఎన్నికపై చర్చించనున్నారు.
పార్టీ అధ్యక్ష ఎన్నికలపై...
ఈరోజు మండల అధ్యక్షులను బీజేపీ ప్రకటించనుంది. ఈ నెల 18వ తేదీన జిల్లా అధ్యక్షుల ఎంపిక జరగనుంది. ఈ నెల చివరి నాటికి రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక ఉంటుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. పార్టీ అధ్యక్ష పదవి రేసులో అనేక మంది పోటీ పడుతున్నారు. అయితే కిషన్ రెడ్డిని ఈ పదవిలో కొనసాగిస్తారా? లేక కొత్త వారికి పార్టీ పగ్గాలు అప్పగిస్తారా? అన్నది తెలియాల్సి ఉంది.