రేపటి నుంచి తెలంగాణలో విద్యాసంస్థలకు సెలవులు
రేపటి నుంచి తెలంగాణలో విద్యాసంస్థలకు సంక్రాంతి సెలవులు ప్రారంభం కానున్నాయి;
రేపటి నుంచి తెలంగాణలో విద్యాసంస్థలకు సంక్రాంతి సెలవులు ప్రారంభం కానున్నాయి. వారం రోజుల పాటు తెలంగాణ విద్యాశాఖ అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. ఈ నెల 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకూ విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించడంతో నేటి నుంచి విద్యార్థులు తమ సొంత గ్రామాలకు బయలు దేరి వెళుతున్నారు.
తిరిగి ప్రారంభం ఎప్పుడంటే?
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రయివేటు, ఎయిడెడ్ పాఠశాలలు, జూనియర్ కాలేజీలకు శనివారం నుంచి సంక్రాంతి పండుగ సెలవులను ప్రభుత్వం ప్రకటించింది. శనివారం నుంచి 17 వ తేదీ వరకు ఏడురోజులపాటు పాఠశాలలకు సంక్రాంతి సెలవులు ఇవ్వాలని విద్యాశాఖ నిర్ణయించింది. శనివారం నుంచి 16వ తేదీ వరకు ఆరురోజులపాటు జూనియర్ కాలేజీలకు సంక్రాంతి సెలవులుంటాయి. ఈనెల 18న పాఠశాలలు, 17న జూనియర్ కళాశాలలు తిరిగి తరగతులు ప్రారంభమవుతాయి.