బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకున్నారో.. మీ అకౌంట్లో డబ్బులు హుష్ కాకి
సైబర్ నేరగాళ్లు కొత్త నేరాలకు తెరతీశారని ఆర్టీసీ ఎండీ సజ్జనర్ తెలిపారు.;
సైబర్ నేరగాళ్లు కొత్త నేరాలకు తెరతీశారని ఆర్టీసీ ఎండీ సజ్జనర్ తెలిపారు. బ్యాంక్ బ్యాలన్స్ చెక్ చేసుకునే సమయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. దీనిని జంప్ డ్ స్కామ్ తో ఆయన పోల్చారు. దీనికి సంబంధించిన ఒక వీడియోను కూడా అవగాహన కల్పించేందుకు పోస్టు చేశారు.
మీ బ్యాంకు ఖాతాలో...
గుర్తు తెలియని వ్యక్తుల నుంచి మీ బ్యాంకు ఖాతాలో డబ్బులు పడినట్లు మెసేజ్ వస్తే వెంటనే యూపీఐ నుంచి మీ ఖాతాల్లో ఎంత నగదు ఉందో చెక్ చేసుకునే ప్రయత్నం చేయవద్దని అన్నారు. నగదు చెక్ చేసుకోవడానికి పిన్ నెంబరు మీరు ఎంటర్ చేసిన వెంటనే అది సైబర్ నేరగాళ్లకు చేరిపోతుందని తెలిపారు. యూపీఐ ఐడీలకు ఫేక్ పేమెంట్స్ లింక్ లను పంపి సైబర్ నేరగాళ్లు ఇటువంటి నేరాలకు పాల్పడుతున్నారని సజ్జనార్ తెలిపారు. ఒక వేళ ఆతృతతోమీ డబ్బులు చేసుకుని లేకపోతే వెంటనే 1930 నెంబరుకు డయల్ చేసి ఫిర్యాదు చేయాలని కూడా సజ్జనార్ ఈ వీడియో ద్వారా అవగాహన కల్పించారు.