KTR : ముగిసిన ఏసీబీ కేటీఆర్ విచారణ
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ విచారణ ముగిసింది.;
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ విచారణ ముగిసింది. ఫార్ములా ఈ రేసు కేసులో ఉదయం పది గంటలకు ఏసీబీ కార్యాలయానికి వెళ్లిన కేటీఆర్ సాయంత్రం ఐదు గంటలకు బయటకు వచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఏడు గంటల పాటు తనను ఏసీబీ అధికారులు ప్రశ్నించారని, ఇది అసంబద్ధమైన కేసు అని అన్నారు.
ఎప్పుడు పిలిచినా...
రేవంత్ రెడ్డి చెప్పిన నాలుగైదు పట్టుకుని పట్టుకుని దానిని నలభై రకాలుగా అడిగేందుకు ప్రయత్నించారన్నారు. ఇది అసంబద్ధమైన కేసు అని తాను ఏసీబీ అధికారులకు చెప్పానని తెలిపారు. తనను మరోసారి విచారణకు రావాలని కోరారన్నారు. అయితే విచారణకు రావాల్సిన తేదీని మాత్రం చెప్పలేదన్నారు. తాను ఎప్పుడు పిలిచినా తిరిగి విచారణకు వస్తానని కేటీఆర్ తర్వాత మీడియాకు చెప్పారు. ఏసీబీ అధికారుల ఎప్పుడు పిలుస్తారో తెలియదని ఎప్పుడు పిలిచినా తాను విచారణకు వస్తానని కేటీఆర్ చెప్పారు.