Revanth Reddy : నేడు నల్లగొండ జిల్లాకు రేవంత్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో పలు ప్రాజెక్టులు, అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. మధ్యాహ్నం రెండుగంటలకు బయలుదేరి హెలికాప్టర్ లో నార్కట్ పల్లి మండలం బ్రాహ్మణ వెల్లంకు చేరుకుంటారు. అనంతరం బ్రాహ్మణ వెల్లం గ్రామ పరిధిలోని ఉదయ సముద్రం ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు.
యాదాద్రి ధర్మల్ పవర్ ప్లాంట్ కు...
అనంతరం మధ్యాహ్నం 3.15 గంటలకు మిర్యాల గూడ నియోజకవర్గంలోని యాదా్రి ధర్మల్ పవర్ ప్లాంట్ ను సందర్శిస్తారు. ప్లాంట్ లో ప్రాజెక్టు యూనిట్ 2 ను ప్రారంభించనున్నారు. సాయంత్రం 4.30 గంటలకు నల్లగొండ లోని మెడికల కళాశాల భవనాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం జరిగే సభలో ఆయన ప్రసంగించనున్నారు. రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే అధికారులు పూర్తి చేశారు. బహిరంగ సభకు పార్టీ నేతలు భారీ జనసమీకరణ చేస్తున్నారు. జిల్లా నలుమూలల నుంచి పార్టీ కార్యకర్తలు, అభిమానులు సభకుహాజరు కానున్నారు.