Revanth Reddy : రేవంత్ అమెరికా టూర్ ఒప్పందాల విలువ 31,532 కోట్లు.. 35,750 మందికి ఉపాధి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన ముగిసింది. తర్వాత ఆయన దక్షిణ కొరియాకు బయలుదేరి వెళ్లారు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన ముగిసింది. తర్వాత ఆయన దక్షిణ కొరియాకు బయలుదేరి వెళ్లారు. అమెరికాలో రేవంత్ రెడ్డి బృందం పందొమ్మిది కంపెనీలతో సమావేశాలు నిర్వహించింది. అవగాహన ఒప్పందాలను వాటితో కుదుర్చుకుంది. ఒప్పందాలు విలువ 31,532 కోట్ల రూపాయలని చెబుతున్నారు. ఈ కంపెనీల రాకతో దాదాపు 30,750 కొత్త ఉద్యోగాలు వస్తాయని చెబుతున్నారు.
డ్రైవర్ లెస్ కార్ లో...
తర్వాత రేవంత్ రెడ్డి డ్రైవర్ లెస్ కార్ లో ప్రయాణం చేశారు. ఫ్యూచర్ కార్ లో ఆయన జర్నీ చేసి దాని విషయాలను అడిగి తెలుసుకున్నారు. శ్రానిఫ్రాన్సిస్కో పర్యటన సందర్భంగా ఆయన ఈ కారులో ప్రయాణం చేశారు. రేవంత్ రెడ్డి వెంట మంత్రి శ్రీధర్ బాబు కూడా ఉన్నారు. డ్రైవర్ అవసరం లేకుండా సెన్సార్లు, జీపీఎస్ ట్రాకింగ్ తో కారు ప్రయాణించడాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన దక్షిణకొరియాకు బయలుదేరి వెళ్లారు. ఈరోజు సియోల్ లోని పలు కంపెనీల ప్రతినిధులతో రేవంత్ రెడ్డి బృందం సమావేశం కానుంది. రేవంత్ ఈ నెల 14న హైదరాబాద్ కు తిరిగి చేరుకుంటారు.