Hyderabad : హైదరాబాద్ కు గుడ్ న్యూస్... నిరుద్యోగులకు పండగ

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన సక్సెస్ ఫుల్ గా సాగుతుంది. హైదరాబాద్ లో గ్రీన్ డేటా సెంటర్ ఏర్పాటు కానుంది

Update: 2024-08-10 02:48 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన సక్సెస్ ఫుల్ గా సాగుతుంది. గత కొద్ది రోజులుగా అమెరికాలో పర్యటిస్తూ పారిశ్రామికవేత్తలను కలుస్తూ తెలంగాణలో పెట్టుబడుల కోసం రేవంత్ రెడ్డి బృందం ప్రయత్నిస్తుంది. అందులో చాలా వరకూ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చాయి. తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఇప్పటి వరకూ పదకొండు కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి.

గ్రీన్ డేటా సెంటర్...
దీంతో పాటు ఆరమ్ ఈక్విటీ పార్టనర్స్ 3,350 కోట్ల రూపాయల పెట్టుబడులతో ముందుకు వచ్చింది. హైదరాబాద్ లో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ , నెక్ట్స్ జనరేషన్, పవర్ గ్రీన్ డేటా సెంటర్ ను నిర్మించేందుకు అంగీకరించింది. అయితే ఈ పెట్టుబడులు దశలవారీగా పెట్టనుంది. ఇది మంచి పరిణామమని, దీనివల్ల అనేక మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పింది. ఏఐ ఆధారిత గ్రీన్ డేటా సెంటర్ ఏర్పాటుకు అంగీకరించడం సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. భారీగా ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు.


Tags:    

Similar News