Telangana : సీఎం సహాయ నిధికి 150 కోట్ల విరాళం

వ‌ర‌ద బాధితుల‌కు స‌హాయంగా ఉద్యోగుల ఒక రోజు వేత‌నం విరాళాన్ని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ప్రకటించింది

Update: 2024-09-03 06:08 GMT

వ‌ర‌ద బాధితుల‌కు స‌హాయంగా ఉద్యోగుల ఒక రోజు వేత‌నం విరాళాన్ని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ప్రకటించింది. 150 కోట్ల రూపాయల విరాళాన్ని ప్రక‌టించిన తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ క‌మిటీ ఛైర్మన్ వి.ల‌చ్చిరెడ్డి తెలిపారు.రాష్ట్రంలో కురుస్తున్న భారీ వ‌ర్షాల‌తో ఆస్తి, ప్రాణ న‌ష్టం జ‌రిగిందని, ప్రభుత్వం త‌గు స‌హాయ‌క చ‌ర్యలను సైతం వేగ‌వంతం చేసింద‌న్నారు. రాష్ట్రంలోని అన్ని విభాగాల‌ ప్రభుత్వ ఉద్యోగుల సైతం స‌హాయ‌క చ‌ర్యల్లో నిమ‌గ్నమ‌య్యారని గుర్తు చేశారు.

ఉద్యోగ సంఘాల జేఏసీ...
ఈ విప‌త్తు భారీగానే న‌ష్టాన్ని క‌లిగిచింద‌న్నారు లచ్చిరెడ్డి. ఈ ఘ‌ట‌న త‌మ‌ను తీవ్రంగా క‌లిచివేసింద‌న్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన త‌ర్వాత దీనిని అతిపెద్ద విప‌త్తుగా తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ క‌మిటీ భావించిందన్నారు. ఇలాంటి స‌మ‌యంలో త‌మ వంతుగా ప్రభుత్వానికి ఆర్ధిక ప‌రంగా చేయూత‌గా నిల‌వాల‌ని భావించామ‌న్నారు. అందులో భాగంగా రాష్ట్రంలోని ఉద్యోగుల త‌రుపున ఒక రోజు వేత‌నం సుమారు 150 కోట్ల రూపాయలను ప్రభుత్వానికి ఇచ్చేందుకు స్వచ్ఛందంగా నిర్ణ‌యం తీసుకోవ‌డం జ‌రిగిందన్నారు.


Tags:    

Similar News