KCR : టచ్ చేసి చూడు అప్పుడు చెబుతా

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు

Update: 2024-02-06 12:09 GMT

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఎన్ని వత్తిడులు తెచ్చినా పదేళ్లలో తాము ఏనాడు తెలంగాణ ప్రాజెక్టులను ఏనాడు అప్పగించలేదని ఆయన స్పష్టం చేశారు. ఈరోజు ఖమ్మం, నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాల నేతలతో సమావేశమై కృష్ణా నదీ జలాల అంశానికి సంబంధించి చర్చించారు. కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ తనను బెదిరించినప్పటికీ తెలంగాణ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని లొంగలేదని అన్నారు.

తనను బెదిరించినా...
ప్రాజెక్టులు తమకు అప్పగించకుంటే నోటిఫై చేస్తామని గజేంద్ర షెకావత్ చెప్పినా తాను నాడు ముఖ్యమంత్రిగా లెక్క చేయలేదన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అవసరమైతే తన ప్రభుత్వాన్ని రద్దు చేస్తానే తప్ప ప్రాజెక్టులను అప్పగించే ప్రసక్తి లేదని చెప్పారు. కావాలంటే రాష్ట్రపతి పాలన పెట్టుకోవాలని తాను అన్నట్లు కూడానేతలకు వివరించారు. తనను, పార్టీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారని, తనను కాని, తన పార్టీని కాని టచ్ చేసి చూడు అప్పుడు చూస్తా అని హెచ్చరించారు. నీ కంటే హేమాహేమీలను తాను ఎదుర్కొన్నానని తెలిపారు. ముందు ముందు ఏం జరుగుతుందో చూద్దామని సవాల్ విసిరారు.


Tags:    

Similar News