దసరా సెలవులపై కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం

దసరా పండుగ సెలవులో మార్పులు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం

Update: 2023-10-07 12:24 GMT

దసరా పండుగ సెలవులో మార్పులు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దసరా సెలవును అక్టోబర్ 23వ తేదీకి మారుస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 24వ తేదీని కూడా సెలవు దినంగా ప్రకటించింది. దసరా పండుగ విషయంలో కొంత సందిగ్ధ నెలకోగా.. తెలంగాణ విద్వత్ సభ ఈ నెల 23న దసరా పండుగను నిర్వహించుకోవాలని సూచించింది. దీంతో ప్రభుత్వం విజయ దశమి సెలవును ఒకరోజు ముందుకు మార్చింది. ఇంతకుముందు ప్రకటించిన సెలవునూ కొనసాగిస్తున్నట్లు తెలిసింది.

దసరా సెలవులను పురస్కరించుకొని అక్టోబర్‌ 13 నుంచి 25 వరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ బడులు, కాలేజీలకు సెలవులు ఉంటాయని తెలిపింది. దాదాపు 13 రోజుల పాటు దసరా సెలవులు ప్రకటించింది. అక్టోబర్‌ 14న బతుకమ్మ పండుగ ఉంది. ఇక దుర్గాష్టమి, మహర్నవమి పండుగలు అక్టోబర్ 22, 23 తేదీల్లో వస్తున్నాయి. మిగతా రెండు రోజులను ఐచ్ఛిక సెలవులు కింద ఇస్తున్నట్లు విద్యాశాఖ స్పష్టం చేసింది. రాష్ట్రంలోని అన్ని రకాల స్కూళ్లలో సమ్మెటివ్‌ అసెస్‌మెంట్‌ పరీక్షలు అక్టోబర్‌ 5వ తేదీ నుంచి అక్టోబర్‌ 11వ తేదీ వరకు జరగనున్నాయి.


Tags:    

Similar News