తెలంగాణ సర్కార్ కు సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్
తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట కలిగింది. ఎమ్మెల్సీల నియామకంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది
తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట కలిగింది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. దీంతో తెలంగాణ ప్రభుత్వానికి పెద్ద రిలీఫ్ దక్కినట్లయంది. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకూ స్టే అమలులో ఉంటుందని జస్టిస్ విక్రమ్‌నాధ్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది.
ప్రభుత్వ హక్కులను...
గత ప్రభుత్వం నియమించిన తమను కాదని కొత్త ప్రభుత్వం ఎమ్మెల్సీలను నియామకం చేపట్టడంపై బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రావణ్, కుర్ర సత్యనారాయణ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కొత్త ఎమ్మెల్సీల నియామకాన్ని నిలుపుదల చేయాలని పిటీషన్ లో కోరారు. కొత్త ఎమ్మెల్సీలను నియమించకుండా స్టే విధించాలని కోరారు. అయితే స్టే ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరించింది. కొత్త ఎమ్మెల్సీలను నియామకాన్ని అడ్డుకుంటే గవర్నర్, ప్రభుత్వ హక్కులుహరించినట్లు అవుతుందని న్యాయస్థానం అభిప్రాయపడింది. విచారణను నాలుగు వారాల పాటు వాయిదా వేసింది.