Telangana : తెలంగాణలో కల్యాణ లక్ష్మి పేరు మార్చిన సర్కార్
తెలంగాణలో గత ప్రభుత్వం అమలు చేసిన మరో పథకం పేరు మారుస్తూ కీలక నిర్ణయం తీసుకుంది;

తెలంగాణలో గత ప్రభుత్వం అమలు చేసిన మరో పథకం పేరు మారుస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. కల్యాణ లక్ష్మి పథకం పేరును కల్యాణమస్తుగా మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంత్రి పొన్నం ప్రభాకర్ పేరు మార్పుపై స్పష్టత నిచ్చారు. కల్యాణ మస్తు పథకాన్ని త్వరలోనే అమలు చేయడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లను తమ ప్రభుత్వం కూడా కొనసాగిస్తుందని మంత్రి పొన్నం తెలిపారు.
ఎన్నికలకు ముందు ఇచ్చిన...
గత ఎన్నికలకు ముందు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద అర్హులైన వారందరికీ లక్షల రూపాయల నగదుతో పాటు తులం బంగారాన్ని కూడా ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. అయితే ఇప్పటి వరకూ పథకం అమలు కాలేదు. కానీ ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న ప్రభుత్వం కల్యాణమస్తును కూడా త్వరలోనే అమలు చేసేందుకు సిద్ధమయింది.