Telanana : నేడు నిరుద్యోగులకు తీపికబురు... ఐదు లక్షల రూపాయలు కావాలంటే?
తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పనుంది.రాజీవ్ యువ వికాస పథకం నేటి నుంచి ప్రారంభం కానుంది;

తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పనుంది. నేటి నుంచి మరొక ప్రతిష్టాత్మకమైన పథకం ప్రారంభం కానుంది. ఈ పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ప్రారంభించనున్నారు. నిరుద్యోగులకు అండగా నిలుస్తామని, స్వయం ఉపాధి కోసం రుణాలను అందచేస్తామని గత ఎన్నికల్లో ఇచ్చిన హామీని నేటి నుంచి ప్రారంభించనుంది. ఈరోజు నుంచి నిరుద్యోగ యువత దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పథకాన్ని ప్రారంభించిన వెంటనే దరఖాస్తులు ఆన్ లైన్ ద్వారా నమోదు చేసుకోవచ్చు.
నిరుద్యోగయువత కోసం...
నిరుద్యోగ యువత కోసం స్వయం ఉపాధి కోసం మూడు నుంచి ఐదు లక్షల రూపాయల రుణాన్ని రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయనుంది. రాజీవ్ యువ వికాసం పధకం దరఖాస్తు చేసుకునేందుకు నేటి నుంచి ఏప్రిల్ ఐదో తేదీ వరకూ గడువు విధించారు. ఇందుకోసం ప్రభుత్వం ఆరు వేల కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం ఇప్పటికే కేటాయించింది. ఎలాంటి ఉద్యోగం లేకుండా నిరుద్యోగిగా ఉన్న వారందరూ ఈ స్కీమ్ కింద దరఖాస్తు చేసుకునే అవకాశముంది. తమకు ఉన్న నైపుణ్యతలు, అర్హతలను కూడా దరఖాస్తులలో పొందుపర్చాల్సి ఉంటుంది.
అర్హతలివే...
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన నిరుద్యోగ యువతకు ఈ పథకం ద్వారా స్వయం ఉపాధి అందించాలన్న లక్ష్యంతోనే ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఐదు లక్షలతో చిన్న తరహా వ్యాపారాలను ప్రారంభించుకోవచ్చు. తమ సొంత ఊళ్లోనే డిమాండ్ కు తగినట్లుగా వ్యాపారాలు చేసుకునే వీలుంది. దీనికి అవసరమైన మార్కెటింగ్, అమ్మకం వంటి వాటిపై కూడా ప్రభుత్వం ఎంపికయిన నిరుద్యోగ యువతకు శిక్షణ ఇవ్వాలని భావిస్తుంది. మొత్తం మీద సుదీర్ఘకాలం నుంచి తమ ఉపాధి అవకాశాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు నిజంగా ఇది గుడ్ న్యూస్ అని చెప్పక తప్పదు.