America : అమెరికాలో తెలంగాణకు చెందిన ముగ్గురి మృతి
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తెలంగాణ వాసులు మరణించారు;

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తెలంగాణ వాసులు మరణించారు. తెల్లవారు జామున మూడు గంటలకు ఫ్లోరిడాలో జరిగిన ప్రమాదంలో తెలంగాణకు చెందిన ఒక కుటుంబం మరణించింది. మృతులను ప్రగతి రెడ్డి, అర్విన్, సునీతలుగా గుర్తించారు. వీరంతా తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా కొందుర్గ్ మండలం టేకులపల్లికి చెందిన వారు అని చెబుతున్నారు.
కారు ప్రమాదానికి గురై...
వీరు ముగ్గురు కారులో వెళుతుండగా ప్రమాదం జరిగింది. ప్రతిగతి రెడ్డి మాజీ ఎంపీటీసీ మోహన్ రెడ్డి కుమార్తెను వివాహం చసుకన్నారు. ఈ ప్రమాదంలో రోహిత్ రెడ్డి, చిన్న కుమారుడు గాయాలపాలయ్యారు. వారిని ఆసుపత్రిలో చేర్చిచికిత్స అందిస్తున్నారు. కారు ను ప్రమాదం జరిగిన సమయంలో రోహిత్ నడిపినట్లు పోలీసులు తెలిసారు.