మరో మూడు రోజుల్లో ఒంటి పూట బడులు?
ఎండల తీవ్రత ఎక్కువ కావడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమయింది. ఒక్కపూట బడులు నిర్వహించాలని నిర్ణయించింది.
ఎండలు మండి పోతున్నాయి. రోజుకు 32 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. దీంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమయింది. ఒక్కపూట బడులు నిర్వహించాలని నిర్ణయించింది. ఎండలు పెరిగిపోయినందున ఈ నెల 16వ తేదీ నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిసింది.
మే 20 వ తేదీ వరకూ....
ఉదయం 7.45 గంటల ుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ పాఠశాలలను నిర్వహించాలని ఉత్తర్వులు వెలువడనున్నాయి. మే 20 వ తేదీ వరకూ ఒంటిపూడ బడులను నిర్వహిస్తారు. ఆ తర్వాత వేసవి సెలవులుంటాయి. జూన్ 12వ తేదీ నుంచి పాఠశాలలు తిరిగి తెరుచుకోనున్నాయి.