Temperatures : ఎండలు మండిపోతున్నాయ్.. జాగ్రత్త పడకపోతే ఇక అంతేనట
ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మార్చి నెలలలోనే ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుకుంటున్నాయి.
ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మార్చి నెలలలోనే ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుకుంటున్నాయి. మార్చి నెలలోనే ఇలా ఉ:టే ఇక మే నెలలో ఎలా ఉంటుందని ప్రజలు బెంబేలెత్తి పోతున్నారు. వాతావరణంలో తేమ శాతం కూడా తగ్గడంతో వేడి గాలులు కూడా ఎక్కువగా వీస్తున్నాయి. దీంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మార్చి నెలలో ఎండలు దంచి కొడుతున్నాయి. ఉష్ణోగ్రతలు 41 డిగ్రీలకు చేరుతుండటంతో ఉదయం పది గంటలు దాటితే బయటకు రావడానికే ప్రజలు భయపడి పోతున్నారు.
అత్యధిక ఉష్ణోగ్రతలు...
జోగులాంబ గద్వాల్ జిల్లాలోని అలంపూర్‌లో నిన్న అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ శాఖ తెలిపింది. అలంపూర్ లో 41 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదు కాగా, తెలంగాణలోని మరికొన్ని జిల్లాల్లో 39 డిగ్రీలు నమోదయినట్లు వాతావరణ శాఖ తెలిపింది. మార్చి నెలలో ఈ రకమైన ఉష్ణోగ్రతలు నమోదు కావడం రికార్డు అని చెబుతున్నారు. నల్లగొండలో 40.9 డిగ్రీలు, సిద్ధిపేటలో 40.8, నిజామాబాద్ లో 40.5, జిగిత్యాలలో 40.5, నిర్మల్ లో 40.4, సూర్యాపేటలో 40.1, హైదరాబాద్‌లో 40.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
మండి పోవడం...
ఐక్యరాజ్యసమితిలో అనుబంధంగా ఉన్న వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరిక జారీ చేసింది. ఈ ఏడాది మే నెలలో ఎండలు మండిపోతాయని తెలిపింది. ఉష్ణోగ్రతలు గతంలో ఎన్నడూ లేని విధంగా గరిష్ట స్థాయికి చేరుకుంటాయని తెలిపింది. ఎండలు మండి పోతుండటం, ఉక్కపోత, వేడిగాలులతో విద్యుత్తు వినియోగం కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువయిందని అధికారులు చెబుతున్నారు. ఎండలకు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఆరోగ్యపరమైన ఇబ్బందులు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈసారి మాత్రం ఎండలు మామూలుగా ఉండవని మార్చి నెలలోనే ట్రయల్ వేసినట్లు అనిపిస్తుంది.