తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి సందడి
ఈ ఏడాది ఏప్రిల్ నెల నుంచి పెళ్లిళ్లు ఎక్కువగా జరుగుతాయి.;

ఈ ఏడాది ఏప్రిల్ నెల నుంచి పెళ్లిళ్లు ఎక్కువగా జరుగుతాయి. రానున్న కాలంలో ముహూర్తాలు లేకపోవడంతో ఏప్రిల్ నుంచి వరసగా మే నెల వరకూ పెళ్లిళ్లు అధిక సంఖ్యలో జరుగుతాయని పండితులు చెబుతున్నారు. మూఢమి వస్తుండటంతో మంచి ముహూర్తాలు లేకపోవడంతో ఈ రెండు నెలల్లోనే ఎక్కువగా పెళ్లిళ్లు జరిగే అవకాశముంది.
మూఢమి ఉండటంతో...
శుభకార్యాలు ఏప్రిల్, మే నెల మాసంలోనే ఎక్కువగా జరగనున్నాయి. మాఘమాసంలో ఈ ఏడాది పెళ్లిళ్లు ఉండవని పండితులు చెబుతున్నారు. జూన్ 9 నుంచి జులై 9వ తేదీ వరకూ, నవంబరు 26 నుంచి ఫిబ్రవరి 17వ తేదీ వరకూ మూఢమి ఉందని చెప్పారు. గురు, శుక్ర ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల ఆ సమయాల్లో శుభాకార్యాలు చేపట్టకూడదని పండితులు చెబుతున్నారు.పుష్య, మార్గ, మాఘ మాసంలో ముహూర్తాలు లేవని చెబుతున్నారు. దీంతో ఏప్రిల్, మే నెలలో పెళ్లిళ్లు జోరుగా జరిగే అవకాశాలున్నాయి.