కేసీఆర్ కు బైబై .. కాంగ్రెస్ కు వెలకమ్ చెప్పండి
గండిపల్లి ప్రాజెక్టు నిర్వాసితులతో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు
గండిపల్లి ప్రాజెక్టు నిర్వాసితులతో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టుల నిర్మాణంలో తీవ్ర జాప్యం జరిగిందని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా అన్నారు మల్లన్నసాగర్ కు ఒక న్యాయం? గండిపల్లికి ఒక న్యాయమా? అని రేవంత్ ప్రశ్నించారు. సొంత ప్రాంతంలో కేసీఆర్ ప్రాజెక్టులు కట్టి కొన్ని ప్రాంతాలకు అన్యాయం చేశారని మండి పడ్డారు.
గండిపల్లి ప్రాజెక్టుకును...
గండిపల్లి ప్రాజెక్టుకును కుర్చీ వేసుకుని కూర్చుని పూర్తి చేయిస్తానని చెప్పిన కేసీఆర్ మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టును ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీ అని, దానిని పూర్తి చేసేది కూడా కాంగ్రెస్ మాత్రమేనని రేవంత్ వారికి తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఆరునెల్లలోనే ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పారు. రాజకీయ విరమణ అని ప్రకటించిన కేసీఆర్ కు ఆయురోరాగ్యాలు కలగాలని, వారి శేష జీవితం ప్రశాంతంగా గడవాలని తాను కోరుకుంటున్నానని రేవంత్ అన్నారు. కేసీఆర్ కు బైబై చెప్పి కాంగ్రెస్ కు స్వాగతం చెప్పాలని పరజలను కోరారు.