రేపు ఢిల్లీలో కేసీఆర్ ధర్నా... ఏర్పాట్లు పూర్తి
ధాన్యం కొనుగోలు చేయాలంటూ రేపు టీఆర్ఎస్ ఢిల్లీలో ధర్నాకు దిగనుంది. ఈ ధర్నాలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొననున్నారు.
ధాన్యం కొనుగోలు చేయాలంటూ రేపు టీఆర్ఎస్ ఢిల్లీలో ధర్నాకు దిగనుంది. ఈ ధర్నాలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొననున్నారు. కేసీఆర్ తో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా పాల్గొంటారు. కేసీఆర్ వారం రోజుల నుంచి ఢిల్లీలోనే ఉన్నారు. రేపటి కార్యక్రమం పూర్తయిన తర్వాత ఆయన తిరిగి హైదరాబాద్ చేరుకుంటారని తెలిసింది. ధాన్యం కొనుగోళ్లపై టీఆర్ఎస్ దశల వారీ ఆందోళనలు చేసిన సంగతి తెలిసిందే.
ఢిల్లీకి చేరుకుంటున్న....
జాతీయ రహదారులపై రాస్తారోకో, ధర్నాలు, మండల, గ్రామ, జిల్లా స్థాయిలో నిరసనలను తెలియజేసింది. ఫైనల్ గా ఢిల్లీలో ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి పెట్టేందుకు ఢిల్లీలో కేసీఆర్ ప్రజా ప్రతినిధులందరితో కలసి ధర్నా చేయాలని నిర్ణయించారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమం ఏర్పాట్లను ఎమ్మెల్సీ కవిత, మాజీ ఎంపీ వినోద్ కుమార్ లతో పాటు పలువురు ఎంపీలు పరిశీలించారు. ఇప్పటికే ఢిల్లీకి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు చేరుకున్నారు.