బండి సంజయ్ కు బెయిల్.. విడుదల చేయాలని జైళ్లశాఖకు హైకోర్టు ఆదేశం
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు ఎట్టకేలకు బెయిల్ మంజూరైంది. బుధవారం సంజయ్ తరపు న్యాయవాది దేశాయ్ ప్రకాష్ రెడ్డి
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు ఎట్టకేలకు బెయిల్ మంజూరైంది. బుధవారం సంజయ్ తరపు న్యాయవాది దేశాయ్ ప్రకాష్ రెడ్డి వాదనలు విన్న హైకోర్టు.. ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు జైళ్లశాఖకు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. వెంటనే ఆయనను విడుదల చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు.. బీజేపీ లీగల్ సెల్ వెల్లడించింది. కాగా.. హైకోర్టులో సంజయ్ తరపు న్యాయవాది అయిన దేశాయ్ ప్రకాష్ రెడ్డి వాదనలు ఇలా ఉన్నాయి.
"పోలీసుల ఎఫ్ఐఆర్ ప్రకారం.. జీఓ 317ను రద్దు చేయాలని బండి సంజయ్ దీక్ష తలపెట్టారు. అయితే పోలీసులు కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించారంటూ దీక్షను భగ్నం చేసేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ ఎంపీను రాత్రి 10గంటల 50నిమిషాలకు అరెస్ట్ చేసి 11గంటల 15నిమిషాలకు FIR నమోదు చేశారు. మేజిస్ట్రేట్ జ్యూడిషల్ కస్టడీ 15 రోజులు చట్టం ప్రకారం సరైనది కాదు. కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించారని రిమాండ్‌కు ఆదేశాలివ్వడం సరికాదు" అని సంజయ్ తరపు న్యాయవాది ఉన్నత న్యాయస్థానం ఎదుట వాదనలు వినిపించారు. ఈ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు.. పర్సనల్ బాండ్, రూ.40 వేలు జరిమానా పై సంజయ్ కు బెయిల్ మంజూరు చేసింది.