Sankranthi : ఉచిత ప్రయాణం అన్నా సరే.. ఆదాయంలో రారాజు టీఎస్ఆర్టీసీ.. ఒక్కరోజు ఆదాయం ఎంతంటే?

సంక్రాంతి పండగకుక టీఎస్ఆర్టీసీకి భారీ ఆదాయం లభించింది. ఒక్కరోజులో పన్నెండు కోట్ల ఆదాయం వచ్చింది

Update: 2024-01-16 03:47 GMT

tsrtc got huge income during sankranti festival. 

సంక్రాంతి పండగకు టీఎస్ఆర్టీసీకి భారీ ఆదాయం లభించింది. దాదాపు నాలుగువేల స్పెషల్ సర్వీసులను టీఎస్ఆర్టీసీ సంక్రాంతి పండగ కోసం నడిపిన సంగతి తెలిసిందే. అయితే సంక్రాంతి ముందు ఒక్కరోజులోనే అంటే ఈ నెల 13వ తేదీన టీఎస్ఆర్టీసీకి పన్నెండు కోట్ల రూపాయల ఆదాయం లభించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఇది ఒక్కరోజు ఆదాయంలో రికార్డుగా ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.

మహాలక్ష్మి పథకం ద్వారా...
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అని చెప్పిన తర్వాత ఈ స్థాయిలో ఆదాయం రావడం రికార్డు బ్రేక్ అని అంటున్నారు. దాదాపు తొమ్మిది కోట్ల రూపాయల జీరో టిక్కెట్లు తెగినట్లు అధికారులు తెలిపారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత ప్రయాణం రాష్ట్రంలో కల్పించిన సంగతి తెలిసిందే. అయినా టీఎస్ఆర్టీసీకి పన్నెండు కోట్ల రూాపాయల ఆదాయం లభించడమంటే ఆషామాషీ కాదంటున్నారు అధికారులు.
సంక్రాంతి పండగ కోసం...
ఈ నెల 13న 53 లక్షల మంది ప్రయాణించినట్లు తెలిపారు. మహిళలు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించినా ఈస్థాయిలో రావడం శుభపరిణామమని అధికారులు చెప్పారు. సంక్రాంతి పండగకు ముందు రోజు పెద్ద సంఖ్యలో హైదరాబాద్ నుంచి జనం సొంతూళ్లకు బయలుదేరారు. పిల్లా పాపలతో కలసి సంక్రాంతి పండగను పల్లెల్లో చేసుకోవడం సంప్రదాయంగా వస్తుండటంతో టీఎస్ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను ఏర్పాటు చేసింది. ఈ ప్రత్యేక సర్వీసుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణాన్ని కల్పించడం విశేషం. అయినా ఆదాయం తగ్గలేదు.


Tags:    

Similar News