ఒకవైపు గ్రూప్ వన్ పరీక్షలు.. మరోవైపు సుప్రీంకోర్టులో విచారణ
గ్రూప్ వన్ పరీక్షలు మధ్యాహ్నం ప్రారంభం కానుండగా, మధ్యాహ్నం 2.30 గంటలకు దీనిపై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది
గ్రూప్ వన్ పరీక్షలు మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభం కానుండగా, మధ్యాహ్నం 2.30 గంటలకు దీనిపై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. పరీక్షల నిర్వహణను వాయిదా వేయాలని, జీవో 29 ను రద్దు చేయాలని, రిజర్వేషన్లు సక్రమంగా పాటించలేదని అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు వారి పిటీషన్ ను కొట్టి వేయడంతో తమ పిటీషన్ ను అత్యవసరంగా విచారించాలంటూ గ్రూప్ వన్ అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
మధ్యాహ్నమే విచారణ...
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దీనిపై విచారణ జరపనున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు విచారణ ప్రారంభం కానుంది. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటీషన్ ను విచారించనుంది. మరోవైపు తెలంగాణలో ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి గ్రూప్ వన్ పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. రేపటి నుంచి 27వ తేదీ వరకూ జరగనున్నాయి. మొత్తం 31 వేల మంది అభ్యర్థులు ఈ పరీక్ష రాయనున్నారు. దీంతో సుప్రీంకోర్టులో ఏం జరుగుతుందోనన్న టెన్షన్ సర్వత్రా నెలకొంది.