వరస సెలవులు.. స్కూళ్లకు సెలవులే సెలవులు
వరస పండగలతో విద్యార్థులకు సెలవులు ఎక్కువగా వస్తున్నాయి, దసరా, క్రిస్మస్ సెలవులను ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
వరస పండగలతో విద్యార్థులకు సెలవులు ఎక్కువగా వస్తున్నాయి. ఈ నెలలో దసరా పండగతో పాటు ఈ ఏడాది జరగనున్న క్రిస్మస్ సెలవులను కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. అలాగే వచ్చే ఏడాది ప్రారంభంలో జరుపుకోనున్న సంక్రాంతి సెలవులను కూడా ప్రభుత్వం డిక్లేర్ చేసింది. దసరా సెలవులను అక్టోబరు 13వ తేదీ నుంచి 25వ తేదీ వరకూ సెలవులు ప్రకటిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దసరా సెలవులను ప్రభుత్వం పదమూడు రోజుల పాటు ప్రకటించింది.
ఏపీలోనూ...
క్రిస్మస్ సెలవులు డిసెంబరు 22వ తేదీ నుంచి 26వ తేదీ వరకూ ప్రకటించింది. మొత్తం ఐదు రోజుల పాటు విద్యాసంస్థలకు తెలంగాణ ప్రభుత్వం పాఠశాలలకు, కళాశాలలకు సెలవులు ప్రకటించింది. సంక్రాంతికి మాత్రం ఆరు రోజుల పాటు సెలవులను ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దసరా సెలవులను ఏపీ ప్రభుత్వం కూడా ప్రకటించింది. పదమూడు రోజుల పాటు దసరా సెలవులను ఇస్తూ నిర్ణయం తీసుకుంది. అక్టోబరు 14వ తేదీ నుంచి సెలవులు ప్రారంభమవుతాయని తెలిపింది. అక్టోబరు 14 నుంచి 24వ తేదీ వరకూ సెలవులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పాఠశాలలతో పాటు కళాశాలలకు కూడా సెలవులు ప్రకటించింది.