మిషన్ భగీరధ ఏఈ..15 కోట్లు కొట్టేసి.. దుబాయ్ పారిపోతుండగా?
మిషన్ భగీరధలో అసిస్టెంట్ ఇంజినీర్ గా పనిచేస్తున్న రాహుల్ బెట్టింగ్‌లకు అలవాటు పడ్డాడు. కోట్ల రూపాయలు అప్పు చేశాడు.
మిషన్ భగీరధలో అసిస్టెంట్ ఇంజినీర్ అతను. భార్య కూడా మంచి ఉద్యోగం. తల్లిదండ్రులు కూడా ప్రభుత్వోద్యోగులే. అయితే డబ్బు ఆశ ఆ యువకుడిని అప్పుల పాలు చేసింది. బెట్టింగ్ ల కోసం అందిన కాడికి అప్పులు చేశాడు. ఆ అప్పులు తీర్చడానికి కాంట్రాక్టర్ల నుంచి డబ్బులు వసూలు చేశాడు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా పదిహేను కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు మాయమాటలు చెప్పి మరీ సొంతం చేసుకున్నాడు. గత కొంతకాలంగా పరారీలో ఉన్నాడు. ఆ అసిస్టెంట్ ఇంజినీర్ దుబాయ్ పారిపోతుండగా పోలీసులు ఢిల్లీ ఎయిర్‌పోర్టులో పట్టుకున్నారు.
బెట్టింగ్ లకు అలవాటుపడి...
మిషన్ భగీరధలో అసిస్టెంట్ ఇంజినీర్ గా పనిచేస్తున్న రాహుల్ బెట్టింగ్‌లకు అలవాటు పడ్డాడు. కోట్ల రూపాయలు బెట్టింగ్‌లలో పోగొట్టుకున్నాడు. విధి నిర్వహణలో కూడా అలసత్వం ప్రదర్శించాడు. దీంతో ఉన్నతాధికారులు అతడిని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేవారు. అయితే కీసర మండలం పరిధిలోని మిషన్ భగీరధ కాంట్రాక్టు పనులను ఇప్పిస్తానని నమ్మబలికి 37 మంది కాంట్రాక్టర్ల నుంచి పదిహేను కోట్లు వసూలు చేశాడు. ఎంతకూ డబ్బులు ఇవ్వకపోవడం, రాహుల్ సస్పెండ్ అయ్యాడని తెలుసుకున్న కాంట్రాక్టర్లు డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి తేవడంతో తప్పించుకు తిరుగుతున్నాడు. దీంతో కాంట్రాక్టర్లు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు రాహుల్ పై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. దుబాయ్ కి పారిపోతుండగా అతడిని అదుపులోకి తీసుకుని కీసరకు తీసుకు వచ్చి విచారిస్తున్నారు. రాహుల్ బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.