కేసీఆర్ క్షమాపణలు చెప్పాల్సిందే

గవర్నర్ కు, తెలంగాణ ప్రజలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలని వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు

Update: 2023-01-26 06:29 GMT

గవర్నర్ కు, తెలంగాణ ప్రజలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలని వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. రిపబ్లిక్ డే వేడుకలకు హాజరు కాకుండా రాజ్యాంగాన్ని కేసీఆర్ అవమానపర్చారని ఆమె అన్నారు. రాజ్యాంగాన్ని అడ్డుపెట్టుకుని తెలంగాణవాదంతో సీఎం అయిన కేసీఆర్ రాజ్యాంగాన్ని గౌరవించం లేదని అన్నారు. అదే రాజ్యాంగం మీద ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారన్నారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకుండా నియంతలా వ్యవహరిస్తున్నారన్నారు. గవర్నర్ కు జరుగుతున్న అవమానాలను తమ పార్టీ వ్యతిరేకిస్తుందని, గవర్నర్ కు మద్దతుగా నిలబడుతుందని ఆమె చెప్పారు.

గవర్నర్ కు మద్దతుగా...
వైభవంగా పరేడ్ గ్రౌండ్స్ లో జరగాల్సిన రిపబ్లిక్ డే వేడుకలను జరపకుండా నియంతలా వ్యవహరించారన్నారు. రాజ్యాంగాన్ని అగౌరవపర్చాని వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. మహిళ అని చూడకుండా, గవర్నర్ పదవికి కూడా గౌరవం ఇవ్వకుండా ఆమెను అగౌరవపర్చే విధంగా వ్యవహరిస్తున్నారన్నారు. కేసీఆర్ కు నియంత పాలన అలవాటుగా మారిందన్నారు. కేసీఆర్ కు ముఖ్యమంత్రి పదవిలో ఉండే అర్హత లేదన్న వైఎస్ షర్మిల తక్షణమే పదవికి రాజీనామా చేసి దళితుడిని ముఖ్యమంత్రిని చేయాలని ఆమె డిమాండ్ చేశారు.


Tags:    

Similar News