తోపులాటలో కిందపడిపోయిన షర్మిల
వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల తోపులాటలో కింద పడిపోయారు. దీంతో షర్మిల ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది.
వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల తోపులాటలో కింద పడిపోయారు. దీంతో షర్మిల ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఉస్మానియా ఆసుపత్రికి బయలుదేరేందుకు వైఎస్ షర్మిల ఇంటి నుంచి బయటకు వస్తుండటంతో పోలీసులు ఆమెను ఇంటి వద్ద అడ్డుకున్నారు. ఉస్మానియా ఆసుపత్రికి వెళ్లేందుకు అనుమతి లేదంటూ పోలీసులు తెలిపారు.
ఇంటివద్ద...
దీంతో పోలీసులు, వైఎస్సార్టీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో వైఎస్ షర్మిల కింద పడిపోయారు. దీంతో పార్టీ కార్యకర్తలు పోలీసులకు, ముఖ్యమంత్రి కేసీఆర్ కు వ్యతిరేకంగా పెద్దయెత్తున నినాదాలు చేస్తున్నారు. లోటస్ పాండ్ వద్ద టెన్షన్ వాతావారణం నెలకొంది. తనను ఎందుకు బయటకు అనుమతించరంటూ వైఎస్ షర్మిల ఉస్మానియా ఆసుపత్రికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఉస్మానియాలో సరైన వసతులు లేవని, రోగుల ఇబ్బందులను పరిశీలించడానికి తాను వెళుతున్నానని ఆమె చెప్పారు.