ఢిల్లీలో షర్మిల.. వివేకా హత్య కేసుపై ఏమన్నారంటే?
వైఎస్ షర్మిల ఢిల్లీలో పర్యటిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై కాగ్ కు ఫిర్యాదు చేశారు
వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల ఢిల్లీలో పర్యటిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకపై ఆమె ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కు ఫిర్యాదు చేయనున్నారు. కాగ్ అధికారులకు కూడా ఆమె కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ వైఎస్ వివేకా హత్య కేసుపై కూడా స్పందించారు.
న్యాయం జరగాలి....
తమ కుటుంబంలో అత్యంత ఘోరంగా జరిగిన హత్య అది అని వైఎస్ షర్మిల అన్నారు. దీనిపై నిజానిజాలు నిగ్గుతేలాల్సిందేనని చెప్పారు. సునీతారెడ్డికి న్యాయం జరగాలన్నారు. ఇతర రాష్ట్రాలకు ఈ కేసును బదిలీ చేయడం మంచిదేనని షర్మిల అభిప్రాయపడ్డారు. ఎవరు హత్య చేశారో వారికి శిక్ష పడాల్సిందేనని ఆమె అన్నారు. దర్యాప్తును ఎవరూ అడ్డుకోకుండా అన్ని చర్యలు తీసుకోవాల్సిందేనని షర్మిల అన్నారు.