రేపు ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా

కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతిపై కేంద్రం తక్షణం స్పందించాలని వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు.

Update: 2023-03-13 12:59 GMT

కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతిపై కేంద్రం తక్షణం స్పందించాలని వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. రేపు జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నామన్నారు. కాళేశ్వరం అవినీతిపై జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వరకు ర్యాలీగా వెళతామని ఆమె తెలిపారు. వైఎస్ షర్మిల మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అవినీతి దేశానికి తెలిసేలా చేస్తామని షర్మిల చెప్పారు. కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక అద్భుతమంటూ తెలంగాణతో పాటు దేశ ప్రజలను మోసం చేశారని ఆమె ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ప్రతిపక్షాలు, మీడియా, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి తెలుసునని అన్నారు. 70 వేల కోట్ల అవినీతితో 2జీ, కోల్ గేట్ కు తీసిపోని స్కాం కాళేశ్వరం అవినీతి అని ఆమె అన్నారు.

ఇంత అవినీతి జరిగినా...
కాళేశ్వరం ప్రాజెక్టులో ఇంత అవినీతి జరిగినా ఇంత వరకు కేంద్ర ప్రభుత్వ సంస్థలు విచారణ చేపట్టలేదన్నారు. 14న వైయస్ఆర్ తెలంగాణ పార్టీ ఢిల్లీలో జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వరకు మార్చ్ చేసుకుంటూ వెళ్లి దేశం మొత్తం, పార్లమెంట్ సభ్యులకు కాళేశ్వరం గురించి తెలిసేలా చేయాలని నిర్ణయించామని షర్మితల తెలిపారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి 38 వేల ఐదు వందల కోట్లతో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు రూపకల్పన చేసి 16 లక్షల 40 వేల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని భావిస్తే, కేసీఆర్ అదే ప్రాజెక్టును రీడిజైనింగ్ పేరుతో లక్షా 20 వేల కోట్ల ఖర్చుతో కేవలం 18 లక్షల 25 వేల 700 ఎకరాలకు మాత్రమే నీళ్లు ఇచ్చేలా చేశారని ఆమె అన్నారు. కాళేశ్వరం అట్టర్ ఫ్లాప్ అయిన ప్రాజెక్ట్ అని, కమీషన్ల కోసమే చేసిన ప్రాజెక్ట్ కాళేశ్వరమని ఆమె అన్నారు


Tags:    

Similar News