వైఎస్ షర్మిల 24 గంటల దీక్ష
వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల ఒకరోజు దీక్షకు దిగారు. 24 గంటల పాటు ఆమె మహబూబ్ నగర్ జిల్లాలో దీక్షకు కూర్చున్నారు.
వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల ఒకరోజు దీక్షకు దిగారు. 24 గంటల పాటు ఆమె మహబూబ్ నగర్ జిల్లాలో దీక్షకు కూర్చున్నారు. పాలమూరు - నీళ్లపోరు పేరిట ఈ దీక్ష చేస్తున్నారు. ఈరోజు సాయంత్రం వరకూ ఈ దీక్ష కొనసాగనుంది. మహబూబ్ నగర్ జిల్లాలో పాదయాత్రలో ఉన్న షర్మిల ఈ దీక్షకు దిగారు. పాలమూరు జిల్లాలో వలసలు ఆగాలని, వైఎస్ సంకల్పించిన ప్రాజెక్టులు పూర్తి చేయాలని షర్మిల డిమాండ్ చేస్తున్నారు.
పాలమూరు - నీళ్లపోరు పేరిట....
పాలమూరు జిల్లాలో భీమా, కోయిల్ సాగర్, నెట్టెంపాడు, కేఎల్ఐ ప్రాజెక్టులు తెచ్చింది వైఎస్ అని, ఆ తర్వాత ఒక ఎకరానికి కూడా ప్రభుత్వం అదనంగా నీళ్లు ఇవ్వలేకపోయిందని షర్మిల ఆరోపిస్తున్నారు. ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేపోతున్నారని ఆమె ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ప్రాజెక్టులపై కేసీఆర్ ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యానికి నిరసనగా తాను 24 గంటల దీక్ష చేస్తున్నట్లు వైఎస్ షర్మిల ప్రకటించారు.