వైఎస్ షర్మిల @ 3000 కి.మీ

వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర నేటికి మూడు వేల కిలోమీటర్లు పూర్తయింది

Update: 2022-11-04 11:50 GMT

వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర నేటికి మూడు వేల కిలోమీటర్లు పూర్తయింది. మంచిర్యాల జిల్లా హాజీపూర్ వద్ద మూడు వేల కిలోమీటర్ల పాదయాత్రను షర్మిల పూర్తి చేశారు. ఈ సందర్భంగా హాజీపూర్ వద్ద వైఎస్సార్ పైలాన్ ను షర్మిల ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో షర్మిల మాట్లాడారు. దెయ్యాలు వేదాలు వల్లించినట్లు కేసీఆర్ తన ప్రభుత్వాన్ని కాపాడాలంటూ వేడుకున్నారని షర్మిల అన్నారు. రైతులకు ఏం చేశారని ఆమె ప్రశ్నించారు. 70 ఏళ్ల వయసులో కూడా కేసీఆర్ ప్రధాని కావాలనుకుంటున్నారన్నారు.

కేసీఆర్ పై ఫైర్...
రైతు బంధు కొందరికే అందుతుందని ఆమె ఆరోపించారు. రైతు ద్రోహి కేసీఆర్ అని అన్నారు. టీఆర్ఎస్ మాత్రం ఎమ్మెల్యేలను కొనుగోలు చేయొచ్చని, అదే బీజేపీ చేస్తే మాత్రం తప్పని అన్నట్లు కేసీఆర్ వ్యవహరిస్తున్నారని తెలిపారు. కేసీఆర్ ఫాంహౌస్ కే పరిమితమయి పాలనను గాలికి వదలేశారన్నారు. కేసీఆర్ ను నమ్ముకుంటే అధోగతేనని ఆమె అన్నారు. తెలంగాణలో రాజన్న రాజ్యం కావాలంటే మీ బిడ్డను ఆశీర్వదించాలని వైఎస్ షర్మిల కోరారు. ఈ కార్యక్రమానికి వైఎస్ విజయమ్మ ముఖ్య అతిధిగా హాజరయ్యారు.


Tags:    

Similar News