వివేకా హత్య కేసులో నిందితుడిని నేడు కోర్టులో

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. పులివెందులకు చెందిన సునీల్‌ కుమార్‌ యాదవ్‌ను గోవాలో అదుపులోకి తీసుకున్నారు. గోవాలో సోమవారం అరెస్ట్‌ [more]

;

Update: 2021-08-04 03:50 GMT

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. పులివెందులకు చెందిన సునీల్‌ కుమార్‌ యాదవ్‌ను గోవాలో అదుపులోకి తీసుకున్నారు. గోవాలో సోమవారం అరెస్ట్‌ చేసిన అనంతరం అక్కడి స్థానిక కోర్టులో హాజరు పరిచినట్లు సీబీఐ అధికారులు వెల్లడించారు. గోవా స్థానిక కోర్టు ద్వారా సునీల్‌ యాదవ్‌ను ట్రాన్సిట్‌ రిమాండ్‌లో కడప తీసుకొచ్చారు. ఈరోజు కడప కోర్టులో సునీల్ కుమార్ యాదవ్ ను హాజరు పర్చే అవకాశముంది. అనంతరం ఆయనను విచారణ కోసం అదుపులోకి సీబీఐ అధికారులు తీసుకోనున్నారు. కాగా సునీల్ కుమార్ యాదవ్ మాత్రం ఈ హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నారు. తనను కావాలని ఇరికించే ప్రయత్నం జరుగుతుందని ఆయన హైకోర్టును కూడా ఆశ్రయించారు.

Tags:    

Similar News