పులివెందులోళ్లు ఒక్కరూ లేరు…. వారంతా?

విశాఖ ఎయిర్ పోర్టు వద్ద చంద్రబాబు ను అడ్డుకున్న వారిలో ఒక్కరు కూడా పులివెందుల వాళ్లు లేరని వైసీపీ నేత అంబటి రాంబాబు తెలిపారు. ఆయన మీడియాతో [more]

;

Update: 2020-02-27 11:43 GMT

విశాఖ ఎయిర్ పోర్టు వద్ద చంద్రబాబు ను అడ్డుకున్న వారిలో ఒక్కరు కూడా పులివెందుల వాళ్లు లేరని వైసీపీ నేత అంబటి రాంబాబు తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ఉత్తరాంధ్రలో ఏం చెప్పాలని చంద్రబాబు అక్కడకు వెళ్లారని అంబటి ప్రశ్నించారు. రాజధానిని అమరావతిలోనే ఉంచాలంటూ ఉత్తరాంధ్రకు వెళితే అక్కడ ప్రజలు అడ్డుకోరా? అని ప్రశ్నించారు. చంద్రబాబును విశాఖ వాసులే అడ్డుకున్నారని అంబటి రాంబాబు తెలిపారు. ప్రతి దానికి పులివెందుల నుంచి వచ్చారంటూ తప్పుడు ప్రకటనలు చేయడం టీడీపీకి అలవాటయిందన్నారు. ఈరోజు ప్రజలే చంద్రబాబును అడ్డుకున్నారన్నారు. గతంలో జగన్ ను విశాఖ ఎయిర్ పోర్టులో అడ్డుకున్నప్పుడు ప్రజాస్వామ్యం ఏమయిందని అంబటి రాంబాబు ప్రశ్నించారు. రోజాను అరెస్ట్ చేసిప్పుడు చంద్రబాబుకు ప్రజాస్వామ్యం కన్పించలేదా? అని నిలదీశారు.

Tags:    

Similar News