Hydra : హైడ్రా రెడీ.. ఆరంతస్థుల భవనాన్ని నేలమట్టం చేసేందుకు సిద్ధం
హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ప్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ఆదివారం కూల్చివేతలకు సిద్ధమయింది.;
హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ప్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ఆదివారం కూల్చివేతలకు సిద్ధమయింది. అయ్యప్ప సొసైటీలో ఉన్న ఆరంతస్థుల భవనాన్ని కూల్చివేతకు రంగం సిద్ధం చేసింది. అనుమతులు లేకుండా బిల్డర్ ఆరంతస్థుల భవనాన్ని నిర్మించడంతో దానిని కూల్చి వేయాలని హైడ్రా అధికారులు నిర్ణయించారు. హైడ్రా కమిషనర్ రంగనాధ్ దగ్గరుండి ఈ కూల్చివేతల ప్రక్రియను ప్రారంభించనున్నారు. అయ్యప్ప సొసైటీలో సెట్ బ్యాక్ నిబంధనలను పాటించకుండా నిర్మాణం చేపట్టిన ఆరంతస్థుల భవనాన్ని నేలమట్టం చేసేందుకు హైడ్రా అధికారులు చర్యలు ప్రారంభించారు. ఈ భవన నిర్మాణంపై స్థానికులు హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేయడంతో అధికారులు యాక్షన్ కు దిగుతున్నారు.
కూల్చివేతలకు ఆదేశం...
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now