Gold Price Today : హమ్మయ్య బంగారం ధరలు శాంతించాయిగా... ఎన్నాళ్లకెన్నాళ్లకు

ఈరోజు దేశంలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. వెండి ధరలు మాత్రం తగ్గాయి.;

Update: 2025-01-05 03:36 GMT

బంగారం ధరలు ఎప్పుడూ ప్రియంగానే ఉంటాయి. దానికి డిమాండ్ అనేది ఎప్పుడూ తగ్గదు. బంగారానికి ఉన్న విలువ అలాంటిది. బంగారం కొనుగోలు చేయడానికి అనేక కారణాలున్నాయి. ఇటు సంస్కృతి సంప్రదాయాల కోసం కొనుగోలు చేస్తుంటారు. అలాగే స్టేటస్ సింబల్ కోసం మరికొందరు కొనుగోలు చేస్తుంటారు. అలాగే కష్టకాలంలో తమను ఆదుకునే వస్తువుగా బంగారాన్ని పరిగణించే వారు అనేక మంది ఉన్నారు. అందుకే దేశీయంగా, అంతర్జాతీయంగా బంగారానికి ఉన్న డిమాండ్ ఎప్పడూ తగ్గదు. వన్నె తగ్గనట్లుగానే దాని గిరాకీ కూడా ఎప్పుడూ తగ్గదన్న అభిప్రాయం చాలా మందిలో ఉంది. కానీ బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో కొనుగోళ్లపై ప్రభావం చూపుతున్నాయని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.


రానున్న కాలంలో...

రానున్న కాలంలో బంగారం, వెండి ధరలు మరింత పెరుగుతాయన్న అంచనాలు వినిపిస్తున్న నేపథ్యంలో ధరలు తక్కువగా ఉన్న సమయంలోనే కొనుగోలు చేయడం మంచిదన్న సూచనలు వెలువడుతున్నాయి. వచ్చే ఏడాదికి బంగారాన్ని కొనుగోలు చేయాలన్నా ఇక కష్టమేనని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. లక్ష రూపాయల వరకూ పది గ్రాముల బంగారం చేరుకునే అవకాశముంటుందని అంచనాలు వినపడుతున్నాయి. ప్రస్తుతం పెళ్ళిళ్ల సీజన్ కూడా నడుస్తుండటం, పండగలు కూడా ఉండటంతో బంగారం విక్రయాలు భారీగానే ఉంటాయని వ్యాపారులు పెద్ద ఆశలు పెట్టుకున్నారు. అందుకు తగినట్లుగా బంగారం, వెండి అమ్మకాలు జరుగుతాయా? లేదా? అన్నది మాత్రం డౌటేనని అంటున్నారు మార్కెట్ నిపుణులు.
స్థిరంగా ధరలు...
కొత్త ఏడాది ప్రారంభం రోజు నుంచి బంగారం ధరలు పెరగడం ప్రారంభించాయి. అయితే నిన్న ధరలు కొంత తగ్గుముఖం పట్టడంతో వ్యాపారులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సేల్స్ పెరిగే అవకాశముందని భావిస్తున్నారు. కొత్త ఏడాది సరికొత్త ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నంలో జ్యుయలరీ దుకాణ యజమానులు ఉన్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. వెండి ధరలు మాత్రం తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 72, 150 రూపాయలుగా నమోదయింది. 24క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 78,710 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 99,000 రూపాయలకు చేరుకుంది.

ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now


Tags:    

Similar News