Hyderbad : హైదరాబాదీలకు శుభవార్త.. నేడు మరో చర్లపల్లి రైల్వే స్టేషన్ ప్రారంభం

హైదరాబాద్ నగర వాసులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.;

Update: 2025-01-06 02:18 GMT

హైదరాబాద్ నగర వాసులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈరోజు చర్లపల్లి రైల్వే స్టేషన్ ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. మోదీ నేడు వర్చువల్ గా ప్రారంభంచనున్నారు. గత ఏడాది డిసెంబరు 28వ తేదీన ఈ టెర్మినల్ ను కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, అశ్వినీ వైష్ణవ్ లు ప్రారంభించాల్సి ఉన్నా మాజీ ప్రధాని మన్మోహన్ మృతితో ఆ కార్యక్రమం వాయిదా పడింది. వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నిత్యం కిటకిటలాడుతుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను ఆదునికీకరిస్తున్నప్పటికీ ప్రయాణికుల వత్తిడి తగ్గించడానికి మరో రైల్వే స్టేషన్ అవసరాన్ని గుర్తించిన రైల్వే శాఖ చర్లపల్లి రైల్వే స్టేషన్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. చర్లపల్లి నుంచి అనేక రైళ్లు బయలుదేరి వెళతాయి. నగరానికి దూర ప్రాంతంలో ఉన్న వారు కూడా చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి తమ గమ్యస్థానాలకు చేరుకునే అవకాశాలున్నాయి.

ప్రయాణికుల రద్దీ...
ప్రయాణికుల రద్దీ కూడా స్టేషన్ లో తగ్గుతుంది. అనేక రైళ్లు ఈ చర్లపల్లి రైల్వే స్టేషన్ కు రానున్నాయి. ప్రధాన మార్గం నుంచి వెళ్లే రైళ్లన్నీ చర్లపల్లి రైల్వేస్టేషన్ లో ఆగుతాయని దక్షిణ మధ్య రైల్వే శాఖ ప్రకటించింది. దీంతో నగరానికి శివారు ప్రాంతం లో ఉన్న వాళ్లు ట్రాఫిక్ రద్దీ ని తట్టుకుంటూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు రావాల్సిన పనిలేదు. ఇకపై చర్లపల్లి నుంచి తమ ప్రయాణాలను కొనసాగించే వీలు కలుగుతుంది. ప్రధాన మైన రైళ్లన్నీ చర్లపల్లి రైల్వేస్టేషన్ వద్ద ఆగుతుండటంతో ప్రయాణికులకు వెసులుబాటు కూడా లభిస్తుంది. నేడు ప్రధాని మోదీ ఈ చర్లపల్లి ర్వైల్వేస్టేషన్ ను ప్రారంభించిన తర్వాత దాదాపు అరవైకి పైగా రైళ్లు ఈ స్టేషన్ లో ఆగుతాయని దక్షిణ మధ్య రైల్వే శాఖ అధికారులు ప్రకటించారు. ప్రయాణికులు ఎక్కువ దూరం ప్రయాణించి సికింద్రాబాద్ కు రావాల్సిన అవసరం లేదని, చర్లపల్లి రైల్వే స్టేషన్ కు వచ్చి అక్కడ తాము ఎక్కాల్సిన రైలు ఎక్కితే సరిపోతుందని చెప్పారు.



ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now


Tags:    

Similar News