పోలీసుల అదుపులో ముగ్గురు ఆగంతకులు

ప్రతిష్ట వేళ అయోధ్యలో ముగ్గురు ఆగంతుకులు పోలీసులకు చిక్కారు. యాంటీ టెర్రిరిస్టు స్క్వాడ్‌ గురువారం సాయంత్రం (ఏటీఎస్‌) అనుమానాస్పదంగా సంచరిస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుంది, ఉత్తరప్రదేశ్‌ డీజీపీ (లా అండ్‌ ఆర్డర్‌) ప్రశాంత్‌ కుమార్‌ ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు.

Update: 2024-01-19 00:54 GMT

రామ మందిర పున: ప్రతిష్ట వేళ అయోధ్యలో ముగ్గురు ఆగంతుకులు పోలీసులకు చిక్కారు. యాంటీ టెర్రిరిస్టు స్క్వాడ్‌ గురువారం సాయంత్రం (ఏటీఎస్‌) అనుమానాస్పదంగా సంచరిస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుంది, ఉత్తరప్రదేశ్‌ డీజీపీ (లా అండ్‌ ఆర్డర్‌) ప్రశాంత్‌ కుమార్‌ ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు.రొటీన్‌గా తనిఖీలు నిర్వహిస్తూ ఉండగా ముగ్గురు సందేహాస్పదంగా తిరుగుతూ కనిపించారని ఆయన చెప్పారు. వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నామని ప్రశాంత్‌ కుమార్‌ తెలిపారు. వారికి ఎలాంటి టెర్రిరిస్టు సంస్థతో సంబంధాలు ఉన్నట్లు ఇప్పటివరకూ బయటపడలేదని చెప్పారాయన.

మరో మూడు రోజుల్లో రాముని విగ్రహ పున:ప్రతిష్ట నేపథ్యంలో.. అనుమానాస్పద వ్యక్తుల సంచారం వార్తతో యంత్రాంగం ఉలిక్కిపడిరది. అయోధ్యకు 22న ప్రధాని సహా దేశంలోని ప్రముఖులంతా హాజరవుతుండటంతో విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. వేల కొద్దీ సీసీ కెమెరాలతో, కృత్రిమ మేధ సహాయంతో రేయింబవళ్లు భద్రతను సమీక్షిస్తున్నారు. అయోధ్య ఐజీ ప్రవీణ్‌ మాట్లాడుతూ ’అన్ని రకాల సాంకేతికతను అయోధ్య భద్రత కోసం ఉపయోగించుకుంటున్నాం. డ్రోన్లు, ఇన్‌ఫ్రా రెడ్‌ కెమెరాలు, సీసీ టీవీలతో నిరంతరం నిఘా పెడుతున్నాం’ అని వివరించారు.

Tags:    

Similar News