Gold Price Today : గుడ్ న్యూస్... ఇప్పుడు ఇక బంగారాన్ని కొనుగోలు చేయండిక
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు కూడా నిలకడకాగానే ఉంది;

బంగారం ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటాయి. ప్రతి రోజూ ధరలు పెరుగుతూ పసిడిప్రియులకు షాక్ ఇస్తున్నాయి. అసలు బంగారాన్ని భవిష్యత్ లో కొనుగోలు చేయగలమా? లేదా? అన్న సందేహం మాత్రం అందరిలోనూ నెలకొంది. ప్రధానంగా మధ్యతరతగి ప్రజలకు బంగారం దూరమయితే తమ వ్యాపారాలు ఇక మూసుకోవడం మినహా మరో మార్గం లేదని జ్యుయలరీ దుకాణాల యాజమాన్యం కూడా అంటోంది. 70 శాతం అమ్మకాలు జరిగితే అందులో యాభై శాతం అమ్మకాలు చేసేది మధ్యతరగతి ప్రజలే కావడం విశేషం. స్కీమ్ లను కట్టి, ఈఎంఐల ద్వారా ముందుగానే నగదును చెల్లించి కొంత మొత్తం కూడబెట్టి ఎక్కువ శాతం బంగారాన్ని కొనుగోలు చేసేది మధ్యతరగతి వర్గమే.
మధ్యతరగతి దూరం కావడంతో...
అలాంటి మధ్యతరగతి వర్గం ఇప్పుడు బంగారం ధరలు చూసి భయపడిపోతుంది. ఆర్థికంగా పెనుభారం పడటం ఒకకారణమయితే, అంత వెచ్చించి కొనుగోలు చేసిన బంగారం ధర పడిపోతే నష్టపోతామన్న ఆందోళన మరొక వైపు వారిని జ్యుయలరీ దుకాణాల వైపునకు దారితీయకుండా అడ్డుకుంటోంది. అదే సమయంలో పెట్టుబడి పెట్టే వారితో పాటు, సంపన్నులు మాత్రమే బంగారాన్ని కొనుగోలు చేస్తుండటంతో అమ్మకాలు ఇటీవల కాలంలో దారుణంగా పడిపోయాయి. గత సీజన్ తో పోలిస్తే అరవై శాతం నుంచి డెబ్భయి శాతం అమ్మకాలు తగ్గినట్లు జ్యుయలరీ దుకాణాల యాజమాన్యం చెబుతుంది. ఈ పరిస్థితి ఇంకా ఎన్నాళ్లు ఉంటుందోనని, తమ దుకాణాలకు మెయిన్ టెనెన్స్ ఖర్చులు కూడా రావడం లేదని వాపోతున్నారు.
స్థిరంగా ధరలు...
పెళ్లిళ్ల సీజన్ లో బంగారం ధరలు మరింతగా పెరుగుతాయి. అందుకే గత కొద్ది రోజులుగా ధరలు మరింతగా పెరుగుతున్నాయి. బంగారం, వెండి ధరలు ఒకదానికి ఒకటి పోటీ పడి పరుగులు తీస్తున్నాయి. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు కూడా నిలకడకాగానే ఉంది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. మధ్యాహ్నానికి ఈ ధరల్లో మార్పులు సంభవించవచ్చు. కొంత తగ్గవచ్చు. లేదా పెరగవచ్చు. నేడు హైదరాబాద్ మార్కెట్ లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 85,090 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 92,830 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 1,13,900 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది.