ఎస్సీ నిరుద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్

ఎస్సీ నిరుద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది.;

Update: 2025-04-03 02:23 GMT
government,  good news ,  sc unemployed,andhra pradesh
  • whatsapp icon

ఎస్సీ నిరుద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఎస్సీ కార్పోరేషన్ ఆర్థిక రుణాలు యాక్షన్ ప్లాన్ విడుదల చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 11 నుండి మే 20 వరకు రుణాల కోసం ఆన్ లైన్ రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చని తెలిపింది. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలను పొంది స్వయంగా ఉపాధి అవశాలు మెరుగుపర్చుకోవడానికి ఈ అవకాశం కల్పించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఈ ఆర్థిక సంవత్సరానికి...
2025 - 26 సంవత్సరానికి ఎస్సీ కార్పోరేషన్ ద్వారా పలు యూనిట్ల ప్రాతిపదికన ఆర్థిక చేయూత రుణాలు అందించడానికి ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. దీని ప్రకారం ఏప్రిల్ 11 నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఆన్ లైన్ రిజిస్ట్రేషన్స్ ప్రారంభం అవుతాయని తెలిపింది. ఇందులో మెడికల్ షాపు, మెడికల్ ల్యాబ్, ఎలెక్ట్రిక్ బ్యాటరీ ఛార్జింగ్ యూనిట్, ఎలెక్ట్రిక్ ఆటో, పాసింజర్ కార్ , గూడ్స్ ట్రక్ తదితర యూనిట్ల ద్వారా అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు.


Tags:    

Similar News