Tirumala : తిరుమలలో రద్దీ కొంత తగ్గినట్లే ఉన్నప్పటికీ.. దర్శన సమయం మాత్రం?

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. గురువారం కావడంతో కొంత భక్తుల రద్దీ తక్కువగా ఉన్నప్పటికీ దర్శనం మాత్రం ఆలస్యమవుతుంది;

Update: 2025-04-03 03:07 GMT
darsan time today in tirumala, rush, devotees, thursday
  • whatsapp icon

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. గురువారం కావడంతో కొంత భక్తుల రద్దీ తక్కువగా ఉన్నప్పటికీ దర్శనం మాత్రం ఆలస్యమవుతుంది. కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులకు దర్శనం చేసుకోవడానికి గంటల సమయం పడుతుంది. నిత్యం భక్తులతో కిటకిటలాడే తిరుమలలో భక్తులు రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో దర్శనం ఆలస్యమవుతుందంటే అర్థం చేసుకోవచ్చు. కానీ భక్తులు సాధారణ సంఖ్యలో ఉన్నప్పటికీ దర్శనానికి గంటలసమయం పడుతుండటంతో భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

కొన్ని రోజులుగా...
గత కొన్ని రోజులుగా తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. పది, ఇంటర్ పరీక్షలు పూర్తి కావడంతో ఎక్కువ మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తిరుమలకు వచ్చి ఏడుకొండల వాడిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. అయితే తిరిగి ఇంటర్ తరగతులు ప్రారంభం కావడంతో కొంత రద్దీ తగ్గింది. అదే సమయంలో ఇక పరీక్ష ఫలితాలు వచ్చిన తర్వాత రద్దీ మరింత పెరుగుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అంచనా వేస్తున్నారు. వేసవిలో సాధారణంగా భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు వస్తుంటారు.
పథ్నాలుగు కంపార్ట్ మెంట్లలో...
ఈరోజ తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని పథ్నాలుగు కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లో వేచి ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనం ఎనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు నాలుగు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 72,721 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వీరిలో 25,545 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం నాలుగు కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు.




Tags:    

Similar News