ఏపీలో ఎన్నికలపై సీఈఓ కీలక వ్యాఖ్యలు
ఎన్నికలకు రెండు నెలల ముందు నుంచే ఆంధ్రప్రదేశ్ లో ఓటు రాజకీయాలు మొదలయ్యాయి. బరిలో ఉంటామనుకుంటున్న అభ్యర్థులు ఎంతైనా ఖర్చు చేయడానికి రెడీ అంటున్నారు. ఈ విషయంలో [more]
ఎన్నికలకు రెండు నెలల ముందు నుంచే ఆంధ్రప్రదేశ్ లో ఓటు రాజకీయాలు మొదలయ్యాయి. బరిలో ఉంటామనుకుంటున్న అభ్యర్థులు ఎంతైనా ఖర్చు చేయడానికి రెడీ అంటున్నారు. ఈ విషయంలో [more]
ఎన్నికలకు రెండు నెలల ముందు నుంచే ఆంధ్రప్రదేశ్ లో ఓటు రాజకీయాలు మొదలయ్యాయి. బరిలో ఉంటామనుకుంటున్న అభ్యర్థులు ఎంతైనా ఖర్చు చేయడానికి రెడీ అంటున్నారు. ఈ విషయంలో టీడీపీ, వైసీపీ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నా రెండు పార్టీల అభ్యర్థులూ ఖర్చుకు వెనుకాడే పరిస్థితి లేదు. ఈ విషయం కేంద్ర ఎన్నికల సంఘం కూడా గుర్తించింది. ఎన్నికల ఖర్చు పరంగా ఆంధ్రప్రదేశ్ సెన్సిటీవ్ స్టేట్ అని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించిందని, ఎన్నికల సమయంలో రాష్ట్రానికి పెద్దఎత్తున ఎన్నికల పరిశీలకులు వస్తారిన ఆయన పేర్కొన్నారు. ఎన్నికల అధికారులు అలర్ట్ గా ఉండాలని ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం చెప్పినట్లు తెలిపారు.